అటల్ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు వేగవంతం
అన్నమయ్య: ఈ నెల 14న ఉదయం 10 గంటలకు మదనపల్లిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద అటల్ బిహారీ వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవిఎన్ మాధవ్ పాల్గొంటారు. టీ. సుండుపల్లె మండలంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర సహకార సంఘం కన్వీనర్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సూచించారు.