విద్యావ్యవస్థ పతనంపై శాప్ ఛైర్మన్ ఆగ్రహం

కృష్ణా: మాజీ సీఎం జగన్ పాలనలో విద్యావ్యవస్థను ధ్వంసం చేశారంటూ శాప్ ఛైర్మన్ అనిమినీ రవినాయుడు విమర్శించారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో ఆర్ఎస్‌యూ 10వ రాష్ట్ర మహాసభల పోస్టర్, లోగో మంగళవారం ఆవిష్కరించారు. విద్యార్థుల సమస్యలపై కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సెప్టెంబర్ 12-14 అమరావతిలో మహాసభలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.