'కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకులా చూస్తుంది'
HYD: కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను ఓటు బ్యాంకులా చూస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మోండా డివిజన్ లోని ఇస్లామియా మసీదులో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మాజీ సీఎం KCR ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడమే కాకుండా రంజాన్ తోఫాలను అందించారని గుర్తు చేశారు.