కార్పోరేటర్‌ను కలిసిన చిరు వ్యాపారులు

కార్పోరేటర్‌ను కలిసిన చిరు వ్యాపారులు

విశాఖ: జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీ చిరు వ్యాపారులు శనివారం జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ.. జనసాంద్రత లేని ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. దీనిపై చిరు వ్యాపారులు తమ గోడును కార్పొరేటర్‌కు వినిపించారు. జనసాంద్రత లేని ప్రదేశంలో తాము వ్యాపారం చేసుకునేది ఎలా అని తెలియజేశారు.