ఈనెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల

కృష్ణా: జిల్లా పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజి కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పశుసంపదను రక్షించేందుకు ప్రతి రైతు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు.