'సారు ఆశయాలే మాకు స్ఫూర్తి'

SDPT: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు X వేదికగా ఆయనకు నివాళులర్పించారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, ఏకైక ఎజెండాగా బతికిన మహనీయుడనీ కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని చాటేలా వారి జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చామన్నారు. జయశంకర్ సారు ఆశయాలే తమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.