పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీఐ

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీఐ

MNCL: ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్పూర్, నాగారం, ర్యాలీ, చిన్న గోపాలపూర్ గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను పట్టణ సీఐ ప్రమోద్ రావు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని కోరారు.