CCI పత్తి కొనుగోలు నిరాకరణతో రైతుల రాస్తారోకో
ASF: వాంకిడి మండల కేంద్రంలోని చెకోపోస్ట్ వద్ద జిన్నింగ్ యార్డులో CCI అధికారులు పత్తిని కొనుగోలు చేయడానికి నిరాకరించడంతో రైతులు ఆగ్రహించారు. దీంతో సుమారు 150 మంది రైతులు పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులు,CCI అధికారులతో చర్చలు జరుపుతున్నారు.