‘భారత జైలు అంటేనే భయమేస్తోంది’
భారత జైలు శిక్ష తలుచుకుంటేనే జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు వణుకు పుడుతోంది. 90వ దశకంలో జమ్మూలోని కోట్ భల్వాల్ జైలు నుంచి సొరంగం తవ్వి పారిపోవాలని చూస్తే అధికారులు చితక్కొట్టారని ఓ ఆడియోలో వాపోయాడు. గొలుసులతో కొట్టారని, ఆ దెబ్బలు తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తోందని అన్నాడు. ఆ శిక్ష తనను మానసికంగా కుంగదీసిందని అంగీకరించాడు. ఈ ఆడియో నిజమేనని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.