88% వైకల్యం ఉన్నా అందని పింఛన్
ASR: పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ కళ్ళబు గ్రామానికి చెందిన కుర్తాడి మత్స్యరాజు(26)కు 88% వైకల్యం, సదరం సర్టిఫికెట్ ఉన్నా.. పింఛన్ అందడం లేదు. బీఏ చదివినా ఉపాధి లేక, నిరుపేద కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. అధికారులు వెంటనే స్పందించి తనకు పింఛన్ మంజూరు చేయాలని సదరు వ్యక్తి వేడుకుంటున్నాడు.