'ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం అందివ్వాలి'
KMM: మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం అందివ్వాలని టీడీపీ నియోజకవర్గ నాయకులు కొండబాల కరుణాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నేలకొండపల్లి మండలం రామచంద్రాపురంలో వరద ఉధృతికి దెబ్బతిన్న పంటలను టీడీపీ నాయకులు పరిశీలించారు. తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు.