స్టేషన్‌ను డీసీపీ, ఏసీపీ ఆకస్మికంగా తనిఖీ

స్టేషన్‌ను డీసీపీ, ఏసీపీ ఆకస్మికంగా తనిఖీ

BHNG: మోత్కూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం భువనగిరి డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిపాలన, కేసుల పరిణామాలు, రికార్డుల నిర్వహణ, తదితర అంశాలపై వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రోజే మోత్కూర్ ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన సీఐ సి. వెంకటేశ్వర్లుతో అధికారులు సమావేశమై పలు మార్గదర్శకాలు ఇచ్చారు.