తల్లిదండ్రుల మధ్య నలిగి.. శిశువు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమరోహా జిల్లా సిహాలి జాగీర్ గ్రామంలో నిద్రపోతున్న తల్లిదండ్రుల మధ్య నలిగి నవజాత శిశువు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సరీ నడుపుతున్న సద్దామ్‌కు ఆస్మాతో వివాహం జరిగింది. గత నెల ఆస్మా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే గత శనివారం రాత్రి తల్లిదండ్రుల మధ్య బాబును పడుకోబెట్టుకోగా.. ఇరుక్కుపోయిన చిన్నారి మృతి చెందాడు.