నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

NLG: పెద్దవూర మండలం చలకుర్తిలోని నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ఈనెల 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.