VIDEO: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా దర్బార్ నిర్వహించినట్లు తెలిపారు. త్వరితగతిన ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.