రోజూ మెట్లు ఎక్కడం వల్ల కలిగే లాభాలు
మెట్లు ఎక్కడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. శరీర బలాన్ని పెంచుతుంది. అదనపు కొవ్వును తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణ నడక లేదా జాగింగ్‌తో పోలిస్తే మెట్లు ఎక్కడం ఎక్కువ శక్తిని వినియోగించే వ్యాయామం. తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వుతో బాధపడేవారికి ఇది సులభమైన వ్యాయామం.