ఉద్యాన కళాశాల నూతన గ్రంథాలయం ప్రారంభం: ఎమ్మెల్యే
WNP: పెద్దమందడి మండల పరిధిలోని ఉద్యాన కళాశాల నూతన గ్రంథాలయాన్ని స్థానిక శాసనసభ్యులు మెఘారెడ్డి ప్రారంభం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని రాష్ట్రస్థాయిలో ఉద్యాన కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉద్యాన కళాశాలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 100 పడకల బాలికల వసతి గృహాన్ని శంకుస్థాపన చేశారు.