'ఆత్మ విశ్వాసంతోనే ఆత్మహత్యల నివారణ'

VZM: ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడే ఆత్మహత్యల ఆలోచన వస్తుందని, కానీ సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని కారుణ్య ఫౌండేషన్ ఛైర్మన్ జె.సి.రాజు అన్నారు. బొబ్బిలి శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా గోడపత్రికల ప్రదర్శన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబం, సమాజం, విద్యాసంస్థలు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.