గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
VKB: జిల్లాలో సర్పంచులు తమ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపి ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. డీపీఆర్సీ భవనంలో సర్పంచుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేస్తూ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు.