ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం బీ.నిడుమానూరు జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న వినయ్ అనే టీచర్‌పై గురువారం పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. బుధవారం గ్రామస్తులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి గ్రామం నుంచి వెళ్ళాగోట్టారు.