రేపు నవోదయ ప్రవేశ పరీక్ష ప్రారంభం
KMM : జిల్లాలోని నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం రేపు పరీక్ష జరగనుంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలేరు నవోదయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,737 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.