కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ హరికృష్ణకు షోకాజ్ నోటీసులు

SDPT: కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ పూజల హరికృష్ణకు క్రమశిక్షణ కమిటీ ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సిద్దిపేటలోని 10 మంది స్థానిక కాంగ్రెస్ నాయకులు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ, హరికృష్ణకు నోటీసులు పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.