'రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు అందలేదు'

KRNL: జిల్లాలో 4,357 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సహాయం అందలేదని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి శుక్రవారం తెలిపారు. 3181 బ్యాంకు ఖాతాలకు ఎన్పీసీఐ గుర్తింపు లేదని, 1176 ఖాతాలకు మ్యాపింగ్ కాలేదని పేర్కొన్నారు. రైతులు ఈనెల 20వ తేదీలోపు బ్యాంకులకు వెళ్లి ఖాతాలను అనుసంధానం చేసుకోవాలని సూచించారు.