VIDEO: న్యాయ దేవత విగ్రహం వద్ద నిరసన
PLD: సత్తెనపల్లిలో న్యాయవాదులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఒంగోలు యువ న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ దారుణ హత్యను ముక్తకంఠంతో ఖండించారు. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయదేవత విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను ఖండించారు.