'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి'

'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి'

NRML: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి, పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తి చేయాలని సూచించారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇసుక తదితర వస్తువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.