మట్టి గణపతిని పూజించండి: ఎస్పీ

మట్టి గణపతిని పూజించండి: ఎస్పీ

WNP: జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ఎస్పీ రావుల గిరిధర్ పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న వినాయక చవితి సందర్భంగా గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను నిషేధించి, మట్టి గణపతులను మాత్రమే ప్రతిష్ఠించాలని సూచించారు. నవరాత్రులు పూర్తయ్యాక మట్టి గణపతిని ఇంటి వద్దే బకెట్‌లో నిమజ్జనం చేసి పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు.