ముమ్మరంగా అభివృద్ధి పనులు

ముమ్మరంగా అభివృద్ధి పనులు

NLG: తిప్పర్తి మండలం గడ్డికొండారం గ్రామపంచాయతీలో సర్పంచ్ శానపాక శ్యాంసుందర్ గ్రామాభివృద్ధి దిశగా చురుకైన చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, మురికికాలువల ఏర్పాటు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులను ప్రాధాన్యతగా చేపట్టి పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి కొనసాగుతోంది.