ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: సౌజన్య
SRD: కళాశాలల్లో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే అక్కడే చర్యలు తీసుకుంటారని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య హెచ్చరించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో గురువారం ర్యాగింగ్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ర్యాగింగ్‌కి పాల్పడితే విద్యార్థులకు జైలు శిక్ష విధిస్తారని చెప్పారు. సమావేశంలో అధ్యాపకులు పాల్గొన్నారు.