హకీంపేట క్రీడా పాఠశాలకు లింగాల విద్యార్థి ఎంపిక

NGKL: లింగాల మండల కేంద్రానికి చెందిన బి.ప్రణీత్ హైదరాబాద్ హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం జిఎన్ఆర్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ప్రణీత్, జూలైలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలల ఎంపికల్లో అత్యంత ప్రతిభ కనబరచి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు హాలరాజు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.