సెంచరీ చేసిన పృథ్వీ షా

బుచ్చిబాబు ట్రోఫీ-2025లో పృథ్వీ షా సెంచరీతో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో మహారాష్ట్ర తరఫున తాను ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం విశేషం. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా, ఫిట్‌నెస్, క్రమశిక్షణ సమస్యల కారణంగా ముంబై అతన్ని జట్టు నుంచి తప్పించింది. దీంతో అతడు మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగాడు.