కడప CI హెచ్చరికలు

కడప: వన్ టౌన్ సీఐ బి. రామకృష్ణ ఆధ్వర్యంలో గుర్రాల గడ్డ, బ్రాహ్మణ వీధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 9 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు అమర్‌నాథ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తులసి నాగ ప్రసాద్ పాల్గొన్నారు.