JNS స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్
HNK: జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని హన్మకొండ కలెక్టర్ స్నేహశబరీష్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియంలోని వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో స్టేడియంలో ఏర్పాటు చేసే తాత్కాలిక స్పోర్ట్స్ స్కూల్ సౌకర్యాలు ఏర్పాటుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.