VIDEO: ధర్మవరంలో సీపీఐ అధ్వర్యంలో ధర్నా
సత్యసాయి: ధర్మవరంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.