ఎరువుల మందుల డీలర్లతో సమీక్ష సమావేశం
NLR: రాపూరు పట్టణంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఇవాళ ఎరువుల మందుల డీలర్లతో వ్యవసాయ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఏడీఏ శివ నాయక్ మాట్లాడుతూ.. యూరియాను సకాలంలో రైతులకు అందజేయాలన్నారు. ఎరువుల పంపిణీ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను డీలర్లకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.