63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం
ఏలూరు: 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంను జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు శనివారం నిర్వహించారు. రేంజ్ ఐజి అశోక్ కుమార్‌తో పాటు ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఇతర అధికారులు గౌరవ వందనం స్వీకరించారు. గృహ రక్షక దళ సభ్యత్వలు 1946వ సంవత్సరములోని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అంకురార్పణ చేశారన్నారు. పోలీసు శాఖలో హోంగార్డ్స్ పాత్ర కీలకమైనదన్నారు.