నేడు రేణిగుంటలో పవర్ కట్
TPT: రేణిగుంట సబ్ డివిజనల్ పరిధిలోని గాజులమండ్యం, ఎల్లమండ్యం తదితర ప్రాంతాలలో ఇవాళ 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ బాబు తెలిపారు. ఈ మేరకు సబ్ స్టేషన్ల మరమ్మతులు, విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.