ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

కృష్ణా: మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఉచిత మట్టి గణనాథుల ప్రతిమలను పంపిణీ చేయనున్నట్టు కమిషనర్ బాపిరాజు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ పంపిణీ జరుగనుందని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల బదులు మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలను ఆయన కోరారు.