VIDEO: విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన
కృష్ణా: గుడివాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ. 6.77 కోట్లతో నిర్మిస్తున్న నూతన సెమి ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేస్తే గుడివాడ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.