ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్!
TG: ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆర్టీసీ అనేక సౌకర్యాలను అందిస్తోంది. టికెట్ రిజర్వేషన్లలో కీలక మార్పులు చేసింది. ఇప్పటినుంచి ప్రయాణికులు 2 నెలల ముందుగానే బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఆర్టీసీ గమ్యం అనే యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ బస్సుల లైవ్ లొకేషన్‌ను ముందుగానే తెలుసుకునే వీలుంది. దీంతో ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు.