ఎమ్మార్వోపై ట్రాక్టర్‌తో హత్యాయత్నం
సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్ నుంచి వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లను ఎమ్మార్వో మహేష్ కుమార్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా డ్రైవర్ ట్రాక్టర్‌తో ఢీకొట్టబోయాడు. ఈ క్రమంలో ఎమ్మార్వో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారైనట్లు ఎమ్మార్వో తెలిపారు. ఎమ్మార్వో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ట్రాక్టర్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.