అమీన్‌పూర్‌లో డబుల్ బెడ్ రూంల పేరిట మోసం
MDK: కిష్టారెడ్డిపేటలో డబుల్ బెడ్‌రూం ఇస్తామని చెప్పి ప్రజల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. జోష్ అనే మధ్యవర్తి ద్వారా పరిచయమైన BHEL ఉద్యోగి ప్రసన్న కుమార్ 69 మంది నుంచి రూ.3–5 లక్షల చొప్పున మొత్తం రూ.2.5 కోట్లు తీసుకున్నట్లు వారు తెలిపారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని అమీన్‌పూర్ పోలీసులను ఆశ్రయించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.