భక్తుల సౌకర్యాల మెరుగుదలపై టీటీడీ సమీక్ష.!

భక్తుల సౌకర్యాల మెరుగుదలపై టీటీడీ సమీక్ష.!

తిరుమల కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద భక్తుల సమస్యలు పరిష్కరించేందుకు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని టీటీడీ అదనపు ఈవో సీ.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు. కాలిబాట మార్గాల్లో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు కలిసి తనిఖీలు చేయాలని, దుకాణాల ధరలను పర్యవేక్షించాలని సూచించారు. లగేజీ కౌంటర్, రిసెప్షన్, కాషన్ డిపాజిట్ వంటి సేవల్లో లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు.