కదిరిలో కళ్యాణోత్సవ టిక్కెట్ల జారీ

కదిరిలో కళ్యాణోత్సవ టిక్కెట్ల జారీ

సత్యసాయి: ​కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆర్జిత కళ్యాణోత్సవ టిక్కెట్ల బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 6 నుంచి 28 మధ్య నిర్ణీత రోజుల్లో ఈ సేవలు నిర్వహిస్తారు. రోజుకు ఐదు టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. టిక్కెట్ ధర రూ. 6500 కాగా, ఐదుగురికి అనుమతి ఉంటుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆలయ అధికారులు కోరారు.