సోళీపూర్లో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
WNP: ఘనపూర్ మండలం సోళీపూర్లో లక్ష్మీనరసింహ యోగానంద సద్గురు స్వాముల జాతర సందర్భంగా బుధవారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పాల్గొనే వారికి ఆకర్షణీయ బహుమతులు సిద్ధం చేశారు. ప్రథమ బహుమతిగా రూ.40 వేలూ, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలూ ఇవ్వనున్నారు.