సిబ్బందితో ప్రత్యేక అధికారిణి సమావేశం

సిబ్బందితో ప్రత్యేక అధికారిణి సమావేశం

VZM: కొత్తవలస మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సచివాలయ ఇంజనీరింగ్ సిబ్బంది, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్‌లతో శుక్రవారం మండల ప్రత్యేక అధికారిణి ఎం.అన్నపూర్ణమ్మ సమావేశం నిర్వహించారు. ఉగాది లోపు ప్రస్తుతం జరుగుతున్న ఇండ్లపై కప్పులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ ఎంపీడీవో నాగేంద్రవ్రసాద్, ఏఈ రఘురామరాజు పాల్గొన్నారు.