VIDEO: ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌పై ఎమ్మెల్యే ఫైర్

కోనసీమ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. 'స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నావ్. నీకు తగదు' అని ఇజ్రాయిల్‌ను ఫోన్లో తీవ్రంగా హెచ్చరించారు. దేశ ప్రధాని మోదీచే ప్రశంసలు అందుకున్న నాయకుడు పవన్ కల్యాణ్ అని పేర్కొన్నారు.