‘ఆధ్యాత్మిక భావాలతో ప్రశాంతత’

‘ఆధ్యాత్మిక భావాలతో ప్రశాంతత’

SKLM: ఆధ్యాత్మిక భావాలను మనసులో పెంచుకోవడం వలన మనిషికి ప్రశాంతత లభిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జగద్ గురువులు ఆది శంకరాచార్యులు జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగర పరిధి పీఎన్ కాలనీ శ్రీ రాజరాజేశ్వరి లలిత మహా త్రిపుర సుందరి దేవి పీఠం ప్రాంగణంలో శనివారం రాత్రి జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.