అనధికార లేఅవుట్‌పై హెచ్చరిక..!

అనధికార లేఅవుట్‌పై హెచ్చరిక..!

KRNL: కల్లూరు మండలం లక్ష్మిపురం గ్రామ పరిధిలోని సర్వే 696 (పి)లో ‘తిరుమల గిరి ఫేస్-6’ పేరుతో ఏర్పాటు చేసిన లేఅవుట్ అనధికారమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఎల్ఆర్ఎస్-2020 కింద కూడా దరఖాస్తులు లేవని కమిషనర్ పేర్కొన్నారు. ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలను ఆయన హెచ్చరించారు.