శ్రీకాకుళంలో ఈ నెల 6 నుంచి సిరిమానోత్సవాలు

SKLM: పాత శ్రీకాకుళం లో గత 50 సంవత్సరాల పైబడి చేసిన సిరిమాను ఉత్సవాలు ఈ నెల 6 నుంచి ప్రారంభించి 10వ తేదీతో ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు సోమవారం వెల్లడించారు. శ్రీకాకుళంలోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మాట్లాడుతూ.. ఈ ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. భక్తులందరూ హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.