VIDEO: బ్యాట్ పట్టిన కావలి ఎమ్మెల్యే కావ్య
NLR: కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్డులోని జడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన కావలి డివిజన్ ఏపీ టీచర్స్ క్రికెట్ & త్రోబాల్ టోర్నమెంట్‌ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి సరదాగా ఎమ్మెల్యే కావ్య క్రికెట్ ఆడారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేశారు.